Anakapalli: అత్తను కర్రతో కొట్టి చంపిన కోడలు!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెంలో ఘోరం. మనవడి విషయంలో జరిగిన చిన్న గొడవ కాస్తా పెద్దదై, అత్తను కోడలు కర్రతో కొట్టి దారుణంగా హతమార్చింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 29 May 2026 4:00 PM IST
Anakapalli
X

Anakapalli: అత్తను కర్రతో కొట్టి చంపిన కోడలు!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ.. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన మహిళ హత్య ఘటనకు సంబంధించి చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ (వయస్సు సుమారు 46 సంవత్సరాలు) తన కుమారుడు, కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబంలో అత్త - కోడళ్ల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది.

తేది 28.05.2026 ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు ఇంటిలో ఉండగా, మనవడు చేసిన చిన్న విషయంపై అత్త - కోడళ్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోడలు నాగమణి కోపోద్రిక్తమై కర్ర చెక్కతో పసలమ్మపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పాసలమ్మను గ్రామస్తులు వెంటనే అనకాపల్లి NTR ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారని మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో ముద్దాయి అయిన కరక నాగమణి W/O లక్ష్మణరావు, వెంకన్నపాలెం గ్రామంలో ఉన్న ఆమె అమ్మగారి ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టుచేసినట్లు తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story