Anakapalli: చోడవరంలో పారిశ్రామిక విప్లవం.. కొత్త ఎంఎస్ఎంఈ పార్కు!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ఆర్.భీమవరంలో ₹4.8 కోట్లతో నిర్మించనున్న కొత్త MSME పార్కుకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 26 May 2026 7:36 AM IST
Anakapalli
X

Anakapalli: చోడవరంలో పారిశ్రామిక విప్లవం.. కొత్త ఎంఎస్ఎంఈ పార్కు!

Anakapalli: జిల్లాలో "ఇంటికో పారిశ్రామికవేత్త" ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరం గ్రామంలో MSME Park శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా స్థానిక శాసనసభ్యులు కె.ఎస్.ఎన్. ఎస్. రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు లతో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇంటికో పారిశ్రామికవేత్త" విధానంలో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మూడో విడత కింద చోడవరం నియోజకవర్గంలోని ఆర్.భీమవరంలో ఈ నూతన పార్కును మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కు మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి కోసం ₹4.8 కోట్లు తో 32.43 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 కేంద్రాలలో పరిశ్రమల అభివృద్ధికి శంకుస్థాపనలు చేయగా, అందులో భాగంగానే చోడవరంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె.ఎస్.ఎన్. ఎస్. రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పలువురు పారిశ్రామికవేత్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story