Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలకు అధికారుల సన్నద్ధత!
Anakapalli: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పట్టణాన్ని 40 వార్డులుగా విభజించి 76 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.
Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలకు అధికారుల సన్నద్ధత!
Anakapalli: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో పట్టణాన్ని 40 వార్డులుగా విభజిస్తూ 76 పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశారు.
మున్సిపాలిటీకి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఈసారి వాటిని 40 వార్డులకు పెంచుతూ విభజన ప్రణాళికను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డుల విభజన తదితర ప్రక్రియలను పూర్తి చేస్తూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు.




