Anakapalli: అనకాపల్లిలో ఎక్సైజ్ మెరుపు దాడులు.. ముగ్గురు అరెస్ట్

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనకాపల్లిలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో 24 మద్యం, 6 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 19 Oct 2026 7:59 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఎక్సైజ్ మెరుపు దాడులు.. ముగ్గురు అరెస్ట్

అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలపై అనకాపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.ఎల్. నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 24 మద్యం బాటిళ్లు, 6 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు, రవాణాపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ గణేష్‌తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ వై.ఎల్. నాయుడు మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

అక్రమ మద్యం విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI