Anakapalli: చోడవరం కేశవస్వామి ఆలయంలో భారీ చోరీ!

Anakapalli: అనకాపల్లి చోడవరం పురాతన కేశవస్వామి ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులు అపహరించిన దుండగుడు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 24 Sept 2026 10:47 AM IST
Anakapalli
X

Anakapalli: చోడవరం కేశవస్వామి ఆలయంలో భారీ చోరీ!

Anakapalli: పురాతన కేశవస్వామి ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఆలయానికి ఉన్న తాళం కప్పలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగుడు స్వామివారి ఆభరణాలు, వెండి వస్తువులు, పూజా సామగ్రిని అపహరించినట్లు ఆలయ అర్చకులు సీతారామాచార్యులు తెలిపారు రాత్రి సుమారు 12 గంటల సమయంలో దుండగుడు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది.

దుప్పటి కప్పుకుని ముఖం కనిపించకుండా ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి గర్భగుడిలోని వస్తువులను అపహరించినట్లు కెమెరా దృశ్యాల్లో కనిపిస్తోంది.

ఈ చోరీలో అమ్మవారి నేత్రాలకు సంబంధించిన సుమారు 3 గ్రాముల బంగారం మరియు సుమారు 505 గ్రాముల వెండి పూజా సామగ్రి చోరీకి అపహరణకు గురైనట్లు అర్చకులు తెలిపారు.

ఉదయాన్నే ఆలయం తెరిచేందుకు వచ్చిన అర్చకులు తాళం కప్పలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆలయ కార్యని ర్వహణాధికారి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నామని. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు సి.ఐ అప్పలరాజు తెలిపారు

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM