Anakapalli: చింతాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి!
Anakapalli: అనకాపల్లి: నర్సీపట్నం - కొయ్యూరు ప్రధాన రహదారిలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం.
Anakapalli: చింతాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి!
Anakapalli: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లె గ్రామాలన్నీ తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షాల ప్రభావంతో నర్సీపట్నం–కొయ్యూరు ప్రధాన రహదారిలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండచరియలు విరిగిపడటంతో రహదారి భద్రత కోసం ఏర్పాటు చేసిన కాంక్రీట్ పిల్లర్ కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం కొయ్యూరు–కేడీపేట రహదారిలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ రోడ్డులో పరిస్థితిని గమనించి నెమ్మదిగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు మరింత విరిగిపడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెల్లడించారు.




