Anakapalli: నిబంధనలు మీరితే కఠిన చర్యలు: ఎక్సైజ్ శాఖ హెచ్చరిక!

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనకాపల్లి పట్టణం, రూరల్ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 22 Oct 2026 11:24 PM IST
Anakapalli
X

Anakapalli: నిబంధనలు మీరితే కఠిన చర్యలు: ఎక్సైజ్ శాఖ హెచ్చరిక!

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా గురువారం అనకాపల్లి పట్టణం, అనకాపల్లి రూరల్ మండల పరిధిలోని వివిధ మద్యం దుకాణాల్లో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అసిస్టెంట్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అనకాపల్లి ఎస్. రవికుమార్ ఆదేశాల మేరకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జగదీశ్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో పాటు అనకాపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తనిఖీల్లో భాగంగా మద్యం దుకాణాల్లో జరుగుతున్న క్రయవిక్రయాలను అధికారులు పరిశీలించారు. అలాగే, ఎక్సైజ్ సురక్ష మొబైల్ అప్లికేషన్ ద్వారా మద్యం నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మద్యం నిల్వలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వాహకులు లైసెన్స్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై. లక్ష్మీనాయుడు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జగదీశ్, ఎక్సైజ్ ఎస్‌ఐలు గిరి, గణేశ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI