Anakapalli: అనకాపల్లి కూటమి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కొణతాల ఘన సత్కారం!

Anakapalli: అనకాపల్లి జోన్ పరిధిలో విజయం సాధించిన ఆరుగురు కూటమి కార్పొరేటర్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘనంగా సత్కరించారు. ప్రజాసేవకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 5 Nov 2026 8:01 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి కూటమి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కొణతాల ఘన సత్కారం!

అనకాపల్లి: ఇటీవల జరిగిన జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనకాపల్లి జోన్ పరిధిలో విజయం సాధించిన ఆరుగురు కూటమి కార్పొరేటర్లకు మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయం సాధించిన కార్పొరేటర్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించడం కేవలం పదవి దక్కించుకోవడం మాత్రమే కాదని, అది ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు అందించిన ఆదరణ, సహకారాన్ని మరువకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఆరుగురు కార్పొరేటర్లకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో వార్డుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ కూటమి నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI