Anakapalli: 83వ వార్డులో రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు కొణతాల!
Anakapalli: అనకాపల్లి 83వ వార్డులో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటన. రూ.5.50 కోట్ల అభివృద్ధి పనులను పరిశీలించి, పలు కొత్త ప్రాజెక్టులకు ఆదేశాలు.
Anakapalli: 83వ వార్డులో రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు కొణతాల!
Anakapalli: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని 83వ వార్డు కూటమి నాయకులు తెలిపారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు 83వ వార్డులో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో 83 వార్డ్ కూటమి నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే వార్డులో సుమారు రూ.5.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గుండాల జంక్షన్‌లో ఆర్‌ఓ కార్యాలయం వెనుక నిర్మించిన సుమారు రూ.2 కోట్ల జీవీఎంసీ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అన్నపూర్ణ బ్యాంక్ రోడ్డులో సమస్యాత్మకంగా ఉన్న కల్వర్టు స్థానంలో సుమారు రూ.38 లక్షలతో కొత్త కల్వర్టు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మిరియాల కాలనీ–లక్ష్మీదేవిపేట ప్రాంతాలను అనుసంధానించే ఎల్లయ్య కాలువపై నిర్మించిన ఐరన్ బ్రిడ్జిని కూడా పరిశీలించారు.
ఏఎంసీ కాలనీలో సెప్టిక్ ట్యాంకులను ఖాళీ ప్రదేశానికి తరలించి పిల్లల కోసం పార్కు ఏర్పాటు చేయాలని, సుమారు రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంచినీటి సమస్య పరిష్కారానికి పాత ట్యాంకు స్థానంలో కొత్త నీటి ట్యాంకు, రైల్వే గేట్ పక్క నుంచి ఏం సి కాలనీకి చేపల బజారు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చర్యలు చేపట్టాలని సూచించారు.
అండర్ బ్రిడ్జి అవతల ప్రాంతం, రజితల వారి వీధి, అయ్యప్పగుప్త హాస్పిటల్ రోడ్డు, మిరియాల కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. వేల్పుల వీధిలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ను సుమారు రూ.30 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలియజేశారు . టౌన్ గర్ల్స్ హైస్కూల్ వెనుక ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు ప్లే ఏరియాగా తీర్చిదిద్దాలని సూచించారు.
పట్టణ సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్–అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద సుమారు రూ.35 లక్షలతో రైల్వే ఇంజన్ ఆకృతి, గాంధీ బొమ్మ సెంటర్‌లో సుమారు రూ.10 లక్షలతో నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు ప్రతిపాదనలు చేపట్టారు. సర్వదాంబ పార్కు అభివృద్ధికి రూ.20 లక్షలు, తాకాసి వీధిలో చిన్న నూకలమ్మ గుడి సమీపంలో కమ్యూనిటీ హాల్ విస్తరణ ఏర్పాటుకు రూ.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
మల్లవరపు వారి వీధి, తాకాసి వీధి, వేల్పుల వీధి, కాశీ విశ్వేశ్వర స్వామి కోవెల రోడ్డు తదితర ప్రాంతాల్లో అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్‌లైన్లకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. లక్ష్మీపేటలో రైతులకు అవసరమైన రహదారి, పోస్టాఫీస్ నుంచి వేల్పుల వీధి కళ్యాణ మండపం వరకు కాలువలు అభివృద్ధి, తాకాసి వీధి టర్నింగ్ వద్ద కాలువపై స్లాబ్ నిర్మాణం తదితర పనులపై కూడా దృష్టి సారించారు.
అనకాపల్లి పట్టణాన్ని గా తీర్చిదిద్దే లక్ష్యంతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, మంచినీటి వసతులు, జంక్షన్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని 83వ వార్డు కూటమి నాయకులు తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో 83వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మంగ ఈశ్వర్ , టిడిపి ఇంచార్జ్ బొద్దపు ప్రసాద్ , గొర్లి శేఖర్, వాకాడు బాబు, దొడ్డి రాము, సురభి హరీష్, షేక్ రియాజ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.




