Anakapalli: విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి – ఒకరికి గాయాలు!

Anakapalli: అనకాపల్లి నాతవరం మండలం గోల్లవీధిలో వర్షానికి విద్యుత్ వైరు తెగిపడి కరెంట్ షాక్‌తో తల్లి, కూతురు దుర్మరణం; మరొకరికి తీవ్ర గాయాలు.

R. A. Naidu, Narsipatnam
Published on: 24 Sept 2026 11:17 AM IST
Anakapalli
X

Anakapalli: విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి – ఒకరికి గాయాలు!

Anakapalli: గోల్ల వీధికి చెందిన శ్రీ గొంప అప్పారావు @ చిన్నబాబు ఇంటి వద్ద విద్యుత్ సర్వీస్ లైన్‌కు సంబంధించిన సపోర్టింగ్ GI వైర్ నిరంతర వర్షం కారణంగా బాగా తడిసి సర్వీసు వైరుకు ఉన్నటువంటి ప్లాస్టర్లు విడిపోయి తెగి, ఇంటి పైకప్పు నుండి వరండాలో వేలాడుతూ ఉంది.

ఆ సమయంలో శ్రీమతి రొంగల జానకి (28 సంవత్సరాలు) బాత్రూంకు వెళ్లేందుకు నిద్రలేచి బయటకు వస్తుండగా, ప్రమాదవశాత్తు వేలాడుతున్న విద్యుత్ జి ఐ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆమె కేకలు విని ఆమె తల్లి శ్రీమతి గొంప మంగ (55 సంవత్సరాలు) జానకిని రక్షించేందుకు ప్రయత్నించగా, ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయారు.

అనంతరం జానకి భర్త శ్రీ రొంగల నాగరాజు (32 సంవత్సరాలు) అక్కడికి వచ్చి చెక్క కర్ర సహాయంతో వైర్‌ను తొలగించేందుకు ప్రయత్నించగా, ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగిలి కేకలు వేస్తుండగా అనంతరం జానకి తండ్రి కూడా కర్ర సహాయంతో వైర్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ కేకలు విన్న పక్కింటి ఆవిడ అంకం రెడ్డి కుమారి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కి ఫోన్ చేయగా పవర్ సప్లై నిలుపుదల చేయడమైనది. అప్పటికే జానకి మరియు ఆమె తల్లి మంగ విద్యుత్ షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

గాయపడిన శ్రీ రొంగల నాగరాజును 108 అంబులెన్స్ ద్వారా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను తదుపరి వైద్య, చట్టపరమైన ప్రక్రియల నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాము.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసు వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం మరింత జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వేలాడుతున్న GI వైర్‌ను తొలగించారు.

మృతులు:

1. శ్రీమతి గొంప మంగ, భర్త: అప్పారావు @ చిన్నబాబు, వయస్సు 55 సంవత్సరాలు, కే. వెలమ, గోల్ల వీధి, నాతవరం.

2. శ్రీమతి రొంగల జానకి, భర్త: రొంగల నాగరాజు, వయస్సు 28 సంవత్సరాలు, గోల్ల వీధి, నాతవరం.

గాయపడిన వ్యక్తి:

శ్రీ రొంగల నాగరాజు, వయస్సు 32 సంవత్సరాలు, తమ్మయ్యపాలెం, నర్సీపట్నం. ప్రస్తుతం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam