Anakapalli: ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత!
Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం నక్కపల్లి మండల ఎంపీటీసీ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
Anakapalli: ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత!
అనకాపల్లి, నవంబర్ 19: నక్కపల్లి మండలం ఉపమాకలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల నుంచి వేద ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ అధికారులు హోంమంత్రి అనితతో పాటు వెంట వచ్చిన ప్రజాప్రతినిధులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా స్వామివారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని హోంమంత్రి అనిత మనస్ఫూర్తిగా ప్రార్థించారు.




