Anakapalli: పరవాడలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రారంభోత్సవం
Anakapalli: అనకాపల్లి జిల్లా పరవాడ బీసీ కాలనీలో వైభవంగా శ్రీ సంపత్ వినాయక ఆలయ పసిడి కలశ ప్రతిష్ట, ప్రారంభోత్సవం. హాజరైన గండి బాబ్జి, ప్రముఖులు.
Anakapalli: పరవాడలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రారంభోత్సవం
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ పరవాడ బి.సి. కాలనీ లో ఆలయ ధర్మకర్త పైల అప్పారావు (టి.వి) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ సంపత్ వినాయక ఆలయం పసిడి కలశ ప్రతిష్ట మరియు ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, గణపతి హోమం, అభిషేకాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, ఏపీ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ గండి బాబ్జి గారు, మండల పరిషత్ అధ్యక్షురాలు పైల వెంకట పద్మలక్ష్మీ శ్రీనివాసరావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు పైలా శ్రీనివాసరావు గారు,జెడ్పీటీసీ పి.ఎస్. రాజు గారు ముఖ్యఅతిథులు గా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండి బాబ్జి గారు మాట్లాడుతూ.. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం పైల వెంకట పద్మలక్ష్మీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీ గణపతి స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
పరవాడ జెడ్పీటీసీ పి.ఎస్. రాజు గారు మాట్లాడుతూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా ప్రజలను ఐక్యం చేసే ఆధ్యాత్మిక కేంద్రాలని పేర్కొన్నారు. శ్రీ గణపతి ఆలయం భక్తులకు నిత్యం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి చెట్లతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమ కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ మాజీ జెడ్పిటిసి పైలా జగన్నాధరావు,మాజీ సర్పంచ్ లు సిరిపురపు అప్పల నాయుడు, పైల అప్పారావు, చుక్క రాము నాయుడు,రెడ్డి శ్రీనివాసరావు,పైలా రామచంద్ర రావు,పైలా సన్యాసిరావు , గ్రామ పెద్దలు, మండల ముఖ్య నాయకులు , బి.సి కాలనీ యూత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




