Anakapalli: రేవుపోలవరం తీరంలో పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ ముందస్తు తనిఖీలు

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో తుఫాను హెచ్చరికలపై పోలీసుల ముందస్తు చర్యలు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 23 Sept 2026 7:15 PM IST
Anakapalli
X

Anakapalli: రేవుపోలవరం తీరంలో పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ ముందస్తు తనిఖీలు

అనకాపల్లి: ఎస్.రాయవరం భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాలు మరియు పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం క్షేత్రస్థాయిలో ముందస్తు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీర ప్రాంతంలో నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ (APSDRF) బృందాలతో కలిసి ప్రత్యేక గస్తీ (పెట్రోలింగ్) మరియు రక్షణ చర్యల సమాయత్తతను పరిశీలించారు.

​ఈ సందర్భంగా అధికారులు రేవుపోలవరం తీరానికి చేరుకుని సముద్రపు అలల ఉధృతిని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఏ క్షణంలోనైనా సహాయక చర్యలు చేపట్టేందుకు SDRF బృందాలు సంసిద్ధంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం స్థానిక ప్రజలు, మత్స్యకారులతో మాట్లాడి తుఫాను ప్రభావం తగ్గేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

ముఖ్య సూచనలు:

​తుఫాను ప్రభావం దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదు. ​తీరప్రాంత మరియు లోతట్టు గ్రామాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైతే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి.

​అత్యవసర సహాయం, సమాచారం కోసం స్థానిక పోలీసులను గానీ, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను గానీ వెంటనే సంప్రదించాలి.

​విపత్కర పరిస్థితులు తలెత్తినా ప్రజలకు తక్షణ రక్షణ మరియు సహాయం అందించడానికి పోలీస్ యంత్రాంగం, SDRF బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ, నక్కపల్లి రూరల్ సీఐతో పాటు స్థానిక ఎస్సై, పోలీస్ సిబ్బంది మరియు APSDRF రెస్క్యూ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.