Anakapalli: అనకాపల్లిలో 2 కేజీల గంజాయి పట్టివేత!

Anakapalli: అనకాపల్లి సంపతిపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో 2 కేజీల గంజాయితో పాటు స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 Oct 2026 7:35 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో 2 కేజీల గంజాయి పట్టివేత!

Anakapalli: అనకాపల్లి రూరల్‌ పోలీసుల వాహన తనిఖీల్లో రెండు కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం మండలంలోని సంపతిపురం జంక్షన్‌ వద్ద పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ 40 ఎల్‌డబ్ల్యూ 8558 నంబర్‌ గల స్కూటీని ఆపి తనిఖీ చేయగా, అందులో రెండు కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో నిందితుడిని చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన దాసరి మధుసూదన్‌గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని పాడువ సంత నుంచి గంజాయిని కొనుగోలు చేసి చేపల ఉప్పాడకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏజెంట్‌గా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు, గంజాయిని కొనుగోలు చేసి చేపల ఉప్పాడలో సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ గంజాయి కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడి వద్ద నుంచి రెండు కేజీల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ వెల్లడించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI