Anakapalli: నక్కపల్లిలో అక్రమ గ్రావెల్ తరలింపు.. టిప్పర్లు సీజ్

Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రేభాక నుండి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు. విస్తృతంగా సాగుతున్న గ్రావెల్ రవాణా.

RAJU, PARAYAKARAOPETA
Published on: 19 Aug 2026 4:55 PM IST
Anakapalli
X

Anakapalli: నక్కపల్లిలో అక్రమ గ్రావెల్ తరలింపు.. టిప్పర్లు సీజ్

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ,నక్కపల్లి మండలం లో భారీగా అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతుంది. రేభాక నుండి ఈ అక్రమ గ్రావెల్ ను తరలిస్తున్న ట్లు సమాచారం.నక్కపల్లి లో సంత మార్కెట్ సమీపంలో వేసిన లే ఔట్ కి గ్రావెల్ అక్రమంగా తరలిస్తుండగా నక్కపల్లి ఎస్.ఐ కి సమాచారం అందడంతో నక్కపల్లి పోలీసులు 3 గ్రావెల్ టిప్ప ర్లను సీజ్ చేశారు.

ఆ సీజ్ చేసిన టిప్పర్ లను సంత వద్ద పార్క్ చేయడం జరిగింది. అలాగే వెదుళ్ల పాలెం జాతీయ రహదారి వద్ద 4 టిప్పర్లు గ్రావెల్ ను అన్లోడ్ చేశారు.

టోల్ ప్లాజా వద్ద సుమారు 10 టిప్పర్ లను ఆపి హెవీ లోడ్ కింద వేయింగ్ వేశారు.అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తుని లో ఓ ప్రముఖ అక్రమ మైనింగ్ వ్యాపార వేత్తకు చెందిన టిప్పర్లు గా సమాచారం..తుని నుండి నక్కపల్లి కి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలింపు కి ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. హోం మంత్రి ఇలాకాలో నే ఈ స్థాయిలో గ్రావెల్ అక్రమ రవాణా జరగడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story