Anakapalli: ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష; పకడ్బందీగా చేపట్టాలని ఆదేశం!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు.
Anakapalli: ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష; పకడ్బందీగా చేపట్టాలని ఆదేశం!
Anakapalli: ప్రత్యేక సమగ్ర సవరణ–2026 ప్రక్రియపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తో కలిసి రోల్ అబ్జర్వర్ గౌతమి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో EROలు, AEROలు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రోల్ అబ్జర్వర్ ఎం.గౌతమి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, ఓటర్ల వివరాల పరిశీలన తదితర అంశాలపై చర్చించారు.
ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అర్హత లేని మరియు మరణించిన వ్యక్తుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిచేయాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే వాటిని గుర్తించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న అర్హులైన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత గడువులోపరిష్కరించాలన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) కీలక పాత్ర పోషిస్తున్నందున, వారికి అవసరమైన మార్గదర్శకాలు, శిక్షణ అందించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్లకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్పించే అభ్యంతరాలు, సూచనలను కూడా నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోల్ అబ్జర్వర్ సూచించారు. ఈ సమావేశంలో EROలు, AEROలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




