Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ టీచర్ల ధర్నా!

Anakapalli: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని కోరుతూ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 12:04 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ టీచర్ల ధర్నా!

Anakapalli: ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్ష ద్వారా విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూళ్లలో 2012 నుంచి కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్నామని వారు తెలిపారు.

సమగ్ర శిక్ష ద్వారా పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ కాంట్రాక్ట్ టీచర్లను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అమలు చేసిన విధంగా ఎంటీఎస్ ప్రకారం ఎస్‌జీటీ స్కేల్ రూ.32,670 చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో ప్రస్తుతం ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, యాక్సిడెంటల్ బెనిఫిట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు డిప్యూటేషన్లను రద్దు చేయాలని, ఈపీఎఫ్, హెల్త్ కార్డు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగుల సర్వీసులో ఉన్నంతకాలం ‘పార్ట్ టైం’ అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ టీచర్లు కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI