Anakapalli: విశ్రాంత హోంగార్డుకు రూ.3.94 లక్షల ఆర్థిక సాయం అందజేత!
Anakapalli: పదవీ విరమణ పొందిన హోంగార్డు మురళీకృష్ణకు రూ.3.94 లక్షల ఆర్థిక సాయం అందించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
Anakapalli: విశ్రాంత హోంగార్డుకు రూ.3.94 లక్షల ఆర్థిక సాయం అందజేత!
Anakapalli: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన హోంగార్డుకు అనకాపల్లి జిల్లా పోలీస్ సిబ్బంది అండగా నిలిచారు. మానవత్వాన్ని చాటుతూ ఆర్థిక సాయం అందజేశారు.
అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు అనకాపల్లి ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కె. మురళీకృష్ణకు బుధవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తన కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు.
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన హోంగార్డులు తమ ఒకరోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా అందించారు. ఈ విధంగా సేకరించిన రూ.3,94,215 విలువైన చెక్కును ఎస్పీ తుహిన్ సిన్హా మురళీకృష్ణకు అందజేశారు. ఆయన విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మురళీకృష్ణ తన విధులను నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించారని తెలిపారు. పదవీ విరమణ పొందిన సహోద్యోగికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో తోటి హోంగార్డులు చూపిన చొరవ అభినందనీయమన్నారు. వారి సేవా స్ఫూర్తి, మానవతా దృక్పథం ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




