Anakapalli: డ్రగ్స్ వద్దు.. చదువే ముద్దు.. అనకాపల్లిలో విద్యార్థుల భారీ ర్యాలీ!

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థులు 'సే నో టూ డ్రగ్స్' పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు.

RAJU, PARAYAKARAOPETA
Published on: 24 Jun 2026 4:31 PM IST
Anakapalli
X

Anakapalli: డ్రగ్స్ వద్దు.. చదువే ముద్దు.. అనకాపల్లిలో విద్యార్థుల భారీ ర్యాలీ!

అనకాపల్లి జిల్లా: ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు లో శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థుల తో అడ్డురోడ్డు శ్రీ ప్రజ్ఞ కళాశాల అధినేత రాము ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్ పేరిట విద్యార్థుల చే ర్యాలీ నిర్వహించారు.అడ్డురోడ్డు లో ఆంజనేయ స్వామి ఆలయ కూడలి వద్ద మానవహారం చేపట్టారు.కళాశాల విద్యార్థులు డ్రగ్స్ వద్దు చదువే ముద్దు అనే నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా అడ్డురోడ్డు ప్రజ్ఞా కాలేజ్ యాజమాన్యం మీడియా తో మాట్లాడుతూ డి.ఐ. జి గోపినాద్ జెట్టి సంకల్పంతో అనకాపల్లి ఎస్.పి ఆదేశాల మేరకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు పై విద్యార్థుల కు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చే డ్రగ్స్ వద్దు చదువు ముద్దు అనే నినాదంతో ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీ కి సహకారాన్ని అనదజేసిన ప్రజ్ఞ కళాశాల యాజమాన్యం రాము ని అభినందించారు. ఈయన వెంట విద్యార్థులు ఉన్నారు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story