Paravada: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

Paravada: అనకాపల్లి జిల్లా పరవాడలో గొన్న కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు మద్యం, గంజాయికి దూరంగా ఉంటామని నిషా ముక్తా భారత్ ప్రతిజ్ఞ చేశారు.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 1 Sept 2026 9:31 PM IST
Paravada
X

Paravada: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం గొన్న కాలేజ్ ఎన్.ఎస్.ఎస్ వారి ఆధ్వర్యం లో జడ్పిహెచ్ హై స్కూల్, ఫార్మాసిటీ కాలనీ,గొన్నవానిపాలెం లో నిషా ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా మద్యం, గంజాయి, సిగరెట్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, మా స్నేహితులు,బంధువులను దూరం గా ఉంచుతూ, మత్తు రహిత భారత్ గా నా దేశాన్ని తయారు చేయడానికి తమవంతు బాధ్యతను నెరవేరుస్తామని జడ్ పి హెచ్ హై స్కూల్ విద్యార్థులు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమం లో జెడ్ పి హైస్కూల్ హెడ్ మాస్టర్ ప్రసాద్,ఇతర ఉపాధ్యా యులు,గొన్న కాలేజ్ ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ch. వెంకట కిషోర్,ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ హిమబిందు తులసి,యామిని, వాలంటీర్స్ రవితేజ, కిషోర్,శ్రీ చరణ్, లోకేష్ మరియు అన్నీ విభాగాల అధిపతులు,అధ్యాపకులు,విద్యార్ధులు పాల్గొన్నారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story