Anakapalli: వేల్పుల వీధిలో గౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం!

Anakapalli: అనకాపల్లి వేల్పుల వీధిలో శ్రీ గౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో జనసేన ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 7 Nov 2026 9:12 PM IST
Anakapalli
X

Anakapalli: వేల్పుల వీధిలో గౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం!

అనకాపల్లి: పట్టణంలోని వేల్పుల వీధిలో శ్రీ గౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

అనకాపల్లి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేల్పుల వీధిలో నిర్వహించిన ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI