Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజలను మోసం చేస్తున్నారు: వైఎస్సార్‌సీపీ

Anakapalli: స్థానిక ఎన్నికల వేళ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నామని, అధికారులు పారదర్శకంగా పనిచేయాలని అనకాపల్లి వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 Sept 2026 3:07 PM IST
Anakapalli
X

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజలను మోసం చేస్తున్నారు: వైఎస్సార్‌సీపీ

అనకాపల్లి: రెండేళ్లుగా పేద ప్రజల సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పథకాలు, కార్యక్రమాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. వివిధ కారణాలు చూపుతూ ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పుతున్న విధానాన్ని ఖండించారు.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ 82, 83 వార్డుల అధ్యక్షులు అల్లు త్రినాథ్, బుద్ద భాస్కరరావు ఆధ్వర్యంలో ఉడ్డుపేట సచివాలయాన్ని పార్టీ నాయకులు సందర్శించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ సచివాలయ సిబ్బందిని కలిసి ప్రభుత్వ విధివిధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విధివిధానాలపై సరైన సమాచారం అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. బాధ్యతాయుతమైన అధికారులుగా రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నడిశెట్టి మధు, కొండూరు రవీంద్ర, కుండల రామకృష్ణ, మొగలిపల్లి సుబ్బారావుతో పాటు పార్టీ నాయకులు ఉగ్గిన అప్పారావు, కారుకుండి కన్నబాబు, తంగెల్ల రామకృష్ణ, ఆకుల సంతోష్, లక్కోజు రాంబాబు, ఉగ్గిన శ్రీనివాసరావు, మొల్లేటి కొండలరావు, పలకా వాసు, దాడి గణేష్, కోన ఉమా, కొంకీ శ్రీరామ్మూర్తి, చింతా రాంజీ, రెడ్డి చిన్నా, దేశెట్టి బసవేశ్వరరావు, పొలిమేర శంకర్, సింగంపల్లి నాగరాజు, యాదగిరి గోవింద, కోలా గణేష్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI