Anandapuram: లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ సజీవ దహనం ఆనందపురంలో ఘోరం!

Anandapuram: ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం. లారీని కారు ఢీకొనడంతో చెలరేగిన మంటలు.. కారులోనే డ్రైవర్ సజీవ దహనం.

SHIVA, BHIMILI
Published on: 31 Aug 2026 12:23 PM IST
Anandapuram
X

Anandapuram: లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ సజీవ దహనం ఆనందపురంలో ఘోరం!

Anandapuram: ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గండిగుండం పరిధి సత్తరువు కూడలి వద్ద రాత్రి 12.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న లారీని ఎరుపు రంగు కారు బలంగా ఢీకొంది. దీంతో కారు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో వాహనం మొత్తం దగ్ధమైంది.

డ్రైవర్‌ బయటకు రాలేక కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. ఆనందపురం ఎస్సై శివ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢీకొన్న సమయంలో కారు నంబర్‌ ప్లేట్‌ లారీకి చిక్కుకున్నట్లు గుర్తించారు. దాని ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story