Anandapuram: గంభీరం రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలకు ఆనందపురం పోలీసుల హెచ్చరిక!
Anandapuram: తుపాను హెచ్చరికల నేపథ్యంలో గంభీరం రిజర్వాయర్, బోనీ గ్రామ పంచాయతీ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆనందపురం సీఐ ఎర్రంనాయుడు హెచ్చరిక.
Anandapuram: గంభీరం రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలకు ఆనందపురం పోలీసుల హెచ్చరిక!
Anandapuram: ఆనందపురం మండల ప్రజలకు మరియు ముఖ్యముగా గంభీరం రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు, బోనీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఆనందపురం పోలీసుల తరుపున CI VVCM Yerram Naidu గారు విజ్ఞప్తి మరియు సూచనలు,
గౌరవనీయులైన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆనందపురం మండల ప్రజలకు మరియు ముఖ్యముగా గంభీరం రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు, బోనీ గ్రామ పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆనందపురం పోలీసులు సూచించారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో రిజర్వాయర్‌లోకి చేపల వేటకు వెళ్లడం, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లడం, రిజర్వాయర్ గట్లు మరియు ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లడం చేయరాదని తెలిపారు.
ప్రజలు, మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:
1. మత్స్యకారులు తదుపరి అధికారిక సూచనలు వచ్చే వరకు రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి.
2. రిజర్వాయర్ నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
3. పిల్లలను రిజర్వాయర్, నీటి కాలువలు, చెరువులు మరియు ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లనివ్వకూడదు.
4. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల సమీపంలో ఉండకూడదు.
5. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
6. అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించి, అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆనందపురం పోలీసు స్టేషన్ CI గారు విజ్ఞప్తి చేశారు.




