Anandapuram: ప్రభుత్వ స్కూల్ విద్యార్థి మునిగాడా గజఈతగాళ్లతో గాలింపు!
Anandapuram: రిజర్వాయర్ గట్టుపై విద్యార్థి బట్టలు, జోళ్లు లభ్యమవడంతో పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. విద్యార్థుల మిస్సింగ్‌పై సమాచారం కోరారు.
Anandapuram: ప్రభుత్వ స్కూల్ విద్యార్థి మునిగాడా గజఈతగాళ్లతో గాలింపు!
ఆనందపురం: మండలం గంభీరం రిజర్వాయర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మునిగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.మంగళవారం ఉదయం పంపు హౌస్ లో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.ఘటనా స్థలాన్ని పరిశీలించగా రిజర్వాయర్ గట్టుపై విద్యార్థికి సంబంధించిన ప్యాంటు, షర్టు,బెల్టు,జోళ్లు లభ్యమయ్యాయి.
విద్యార్థి నీటిలో మునిగిపోయినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు గజఈతగాళ్లతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని మధురవాడ, పీ.ఎం.పాలెం, ఆనందపురం,భీమిలి తదితర ప్రాంతాల పాఠశాలలు, హాస్టళ్లలో ఎవరైనా విద్యార్థులు కనబడకుండా పోతే వెంటనే సమాచారం అందించాలని ఆనందపురం సీఐ వాసునాయుడు,
పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు. ఎవరైనా విద్యార్థి మిస్సయినట్లు గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.




