Anandapuram: ఆనందపురంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు ప్రత్యేక సమావేశం!
Anandapuram: ఆనందపురం మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నికల నిమిత్తం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
Anandapuram: ఆనందపురంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు ప్రత్యేక సమావేశం!
ఆనందపురం: ఆనందపురం మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిమిత్తం ప్రత్యేక సమావేశం జరగనుంది.తొలుత కో-ఆప్టెడ్ సభ్యుడి పదవికి నామినేషన్లు స్వీకరించి, ఉదయం 11 నుండి 12 గంటల మధ్య పరిశీలన (స్క్రూటినీ) చేపడతారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం కో-ఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకుని, ప్రిసైడింగ్ అధికారి ఆ సభ్యుడితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు.




