Gajuwaka: రానున్న 30 గంటలు కీలకం: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు!

Gajuwaka: రానున్న తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు.

PRAKASH, GAJUWAKA
Published on: 27 Oct 2026 11:19 PM IST
Gajuwaka
X

Gajuwaka: రానున్న 30 గంటలు కీలకం: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు!

గాజువాక: రాష్ట్రంలో రానున్న తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పలు కీలక సూచనలతో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసారు.

అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప బయటికి రాకుండా ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని వారు కోరారు. అలానే రానున్న 30 గంటల పాటు వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని, పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు కూడా సహాయక చర్యల కోసం అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా పల్లా గారు భరోసానిచ్చారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA