Annakapalli: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Annakapalli: అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 2 Sept 2026 6:02 PM IST
Annakapalli
X

Annakapalli: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అనకాపల్లి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. జనసేన శ్రేణులు, యువత, వీర మహిళలు, అభిమానులు భారీగా తరలిరావడంతో అనకాపల్లి పండుగ వాతావరణాన్ని తలపించింది.

మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ రావుగోపాలరావు కళాక్షేత్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బైక్‌లతో జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ నినాదాలతో అనకాపల్లి మార్మోగింది.

అనంతరం డాక్టర్ రావుగోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనసేన శ్రేణుల సమక్షంలో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి జనసేనాని కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజాసేవా స్ఫూర్తిని, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను కొణతాల రామకృష్ణ కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్, పోలవరం ఎడమ కాలువ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి కీలక అంశాల్లో పవన్ కళ్యాణ్ చొరవను ప్రస్తావించారు.

అనంతరం పిఠాపురంలో నిర్వహించిన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన శ్రేణులు వీక్షించారు. కార్యక్రమం సందర్భంగా జై కొట్టు నినాదాలతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు.

అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధిక జనసేన సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘనంగా సత్కరించి అభినందించారు.

నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులతో వేడుకలు సందడిగా సాగాయి. భారీ బైక్ ర్యాలీ నుంచి కేక్ కటింగ్, సన్మాన కార్యక్రమాల వరకు ప్రతి చోటా జనసేన శ్రేణుల్లో పవన్ బర్త్‌డే జోష్ కనిపించింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI