Pendurthi: సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు రాక కూటమి నేతల విస్తృత సమావేశం!

Pendurthi: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీటి విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. పెందుర్తిలో సీఎం పర్యటన విజయవంతంపై టీడీపీ-కూటమి నేతల విస్తృత సమావేశం.

GOPI, PENDURTHI
Published on: 31 Aug 2026 4:22 PM IST
Pendurthi
X

Pendurthi: సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు రాక కూటమి నేతల విస్తృత సమావేశం!

Pendurthi: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీటి విడుదల కార్యక్రమానికి సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ–కూటమి నేతలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండి బాబ్జి, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జ్ బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఇచ్చాపురం ఎమ్మెల్యే, జోనల్ కోఆర్డినేటర్ బెందాళం అశోక్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు అందించే కార్యక్రమం ఎంతో కీలకమైనదని పేర్కొంటూ.. సీఎం పర్యటనను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు, వార్డు నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story