Paderu: రాష్ట్ర పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం!
Paderu: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి జిల్లా టూరిజం అధికారి చలపతిరావు తెలిపారు.
Paderu: రాష్ట్ర పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం!
పాడేరు: అల్లూరు జిల్లా పాడేరులో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రదానం.
చేయనున్న రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు–2025-26కు అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక శాఖ అధికారి శ్రీ పట్టాసి చలపతిరావు తెలిపారు.
ఈ ఏడాది 38 విభాగాల్లో మొత్తం 46 పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. హోటళ్లు, భోజనశాలలు, ప్రయాణ సంస్థలు, పర్యటన నిర్వాహకులు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, పర్యాటక మార్గదర్శకులు, రచయితలు, చలనచిత్ర రంగం, డిజిటల్ మాధ్యమం తదితర విభాగాలను పురస్కారాల కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుల తుది గడువు: సెప్టెంబరు 18, 2026
అర్హులైన వారు నిర్దేశిత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి సెప్టెంబరు 18, 2026లోగా సమర్పించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి కోరారు. ఎంపికైన వారికి సెప్టెంబరు 27, 2026న రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని “డిజిటల్ కార్యాచరణ, కృత్రిమ మేధస్సు ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక కేంద్రాల నిర్వాహకులు, పర్యాటక రంగ సంస్థలు మరియు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
దరఖాస్తులను నేరుగా లేదా తపాలా ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, విజయవాడ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
దరఖాస్తు నమూనా, అర్హతలు, మార్గదర్శకాలు మరియు ఇతర వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారిక వెబ్‌సైట్ www.aptourism.gov.inను సందర్శించాలని తెలిపారు.




