Visakhapatnam: నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు తీరంలో బలమైన గాలులు!

Visakhapatnam: దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై అల్పపీడనం.. నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాల హెచ్చరిక.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 12 Sept 2026 9:51 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు తీరంలో బలమైన గాలులు!

Visakhapatnam: విశాఖ దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్,విదర్భ మీదుగా కదిలే అవకాశం

దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు.

నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్టరు వర్షాలు కురిసే అవకాశం, ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు.

విజయనగరం,మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలీ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.