Appanapalli: అప్పనపల్లి కాజ్‌వే పనులను వేగవంతం చేయాలి కలెక్టర్

Appanapalli: అప్పనపల్లి కాజ్‌వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్. వరద వేళల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం.

RAJU, P GANNAVARAM
Published on: 1 Aug 2026 4:40 AM IST
Appanapalli
X

Appanapalli: అప్పనపల్లి కాజ్‌వే పనులను వేగవంతం చేయాలి కలెక్టర్

అప్పనపల్లి: అప్పనపల్లి కాజ్-వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలోని కాజ్వే పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద ఉధృతి పెరిగితే వెంటనే కాజ్‌వేపై రాకపోకలను నిలిపివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉంచి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story