Visakhapatnam: విశాఖ వాల్తేరు డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం!

Visakhapatnam: విశాఖ వాల్తేరు డిపో వద్ద నెల్లూరు నుంచి వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.. ఖాళీగా ఉండటంతో తప్పిన ప్రమాదం, పోలీసుల దర్యాప్తు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 12 Sept 2026 10:02 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ వాల్తేరు డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం!

Visakhapatnam: విశాఖ నగరంలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సు వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచగా ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా దగ్ధ మైంది.

నెల్లూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ బస్సు విశాఖకు చేరు కుంది అనంతరం వాల్తేరు డిపో వెలుపల బస్సును నిలిపి ఉంచారు అయితే, శనివారం తెల్లవారు జామున ఒక్కసారిగా బస్సు ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి.

బస్సు ఖాళీగా ఉన్న సమ యంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించి వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది బస్సు తగల బడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు సిబ్బంది వెంటనే పోలీసుల కు,అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు ఆర్టీసీ ఉన్నతాధి కారులు,పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీ లించారు బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం తో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.