Anakapalli: పరవాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం!

Anakapalli: పరవాడలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వ్యాసరచన పోటీలు, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ. విజేతలకు బహుమతుల ప్రదానం.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 17 Aug 2026 10:05 AM IST
Anakapalli
X

Anakapalli: పరవాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం!

Anakapalli: ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 70 వ ఆవిర్భావ దినోత్సవ సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక బాలికల ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో జర్నలిజం పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోకేష్, శివాజీ, గౌరవాధ్యక్షులు రవి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు విశ్వనాథం, సభ్యులు బాబు, జగదీష్, గణేష్, శ్రీను, కన్నబాబు, సునీల్, ఈశ్వరరావు, చందు, మోహన్, విందుల మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story