Vizag: ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం, పెన్షన్ ఇవ్వాలి.. గంట్ల శ్రీను

Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జూలై 31న ‘జర్నలిస్టుల డిమాండ్స్ డే’ నిర్వహించనున్నట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది.

GOPI, PENDURTHI
Published on: 15 July 2026 10:22 AM IST
Vizag
X

Vizag: ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం, పెన్షన్ ఇవ్వాలి.. గంట్ల శ్రీను

Vizag: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి జూలై 31న జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది... ఈ మేరకు మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలు పై కార్యవర్గం చర్చించడం జరిగిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో విపులంగా వివరించడం జరిగిందన్నారు.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం కేటాయించాలని అలాగే పెన్షన్ సదుపాయం అమలు చేయాలని.. ప్రమాద బీమా ను పునరుద్ధరించాలని ఇలా ఆరు డిమాండ్లపై కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది అన్నారు.. తాము లేవనెత్తిన అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్ష.. కార్యదర్శులు వెంకట్రావు జి ఆంజనేయులు.. ఇతర కార్యవర్గం సానుకూలంగా స్పందించిందని.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించడంతోపాటు అదే సమయంలో ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కార్యవర్గం నిర్ణయించడం జరిగిందని గంట్ల శ్రీనుబాబు వివరించారు.. ప్రధాన డిమాండ్లతో ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు కు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.. అలాగే సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు.. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు..

విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ.. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ సాంబశివరావు.. ఉపాధ్యక్షులు పి..నగేష్ బాబు.. జాయింట్ సెక్రెటరీ గొడబ రాంబాబు.. బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు. కార్యదర్శి కిెంతాడ మదన్.. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. వెంకటేష్.. ఖాదర్.. బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు భాష.. హమీద్ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story