Araku: అరకు సంతబయలు గ్రామంలో మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ

Araku: అల్లూరి జిల్లా అరకు సంతబయలు గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

REHAMAN, ARAKU
Published on: 5 Sept 2026 9:55 PM IST
Araku
X

Araku: అరకు సంతబయలు గ్రామంలో మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ

Araku: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సీఐ గారు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం శుక్రవారం అరకు సంత బయలు గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలకు మరియు గ్రామస్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

“డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, గ్రామాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సిఐ గారు సూచించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తామని పోలీసులతో ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీ ఎల్ సురేష్ గారు మరియు అనంతగిరి ఎస్సై శ్రీ శంకర్రావు గారు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU

Next Story