Araku: వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం సమ్మె
Araku: వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ అరకులో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. జీవోలను అమలు చేయాలని డిమాండ్.
Araku: వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం సమ్మె
అరకు: రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హామీ అమలు చేస్తూ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని శాశ్వత ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేసే లోపు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అరకువేలి, అనంతగిరి, డుమ్రిగూడ పరిధిలోగల వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు మాట్లాడుతూ,
ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు 14700 మంది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జిల్లా, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్స్, ఫార్మ సిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్, రేడియేటర్లు, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు గా వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా ఉద్యోగాలు పొంది పది సంవత్సరాల నుండి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేస్తామని జీవో నెంబర్ 34,35 విడుదల చేశారని ఆదివాసి షెడ్యూల్ ప్రాంతంలో పనిచేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కోసం జీఓ నెంబర్ 68 ఉందని ఆ జీవోను కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కనీసం పట్టించుకోలేదని గత నెల రోజుల నుండి నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతూ విధులు నిర్వహించామని వారు అన్నారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టినట్లు ఉద్యోగులు తెలిపారు. అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులకు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు విజ్ఞాపనాలు సమర్పించామని అయినప్పటికీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ ఒక తీరు ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల జేఏసీ నాయకులు రాంబాబు, ఉమాదేవి, సావిత్రి, సుబ్బలక్ష్మి, సోమేశ్ కుమార్, సింహాచలం, ఉష, బుజ్జి, రోజారాణి, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




