Araku: సీట్ల సర్దుబాటుపై అరకు నియోజకవర్గ కూటమి సమన్వయ భేటీ
Araku: అరకు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో సమన్వయ సమావేశం విజయవంతంగా జరిగింది.
Araku: సీట్ల సర్దుబాటుపై అరకు నియోజకవర్గ కూటమి సమన్వయ భేటీ
అరకు: అరకు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీ, జనసేన , భారతీయ జనతా పార్టీల నేతలు అరకులో సోమవారం సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ తరఫున అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ డా.సియ్యారి దొన్ను దొర గారు, అరకు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షురాలు మోజోరు తేజోవతి గారు, అరకు పార్లమెంట్ అబ్జర్వర్ శాసన మండలి సభ్యులు పేరా బత్తుల రాజశేఖరం గారు , జనసేన తరఫున ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కమిటీ చైర్మన్ నాగబాబు గారు, జనసేన పార్టీ అరకు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త , పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య గారు, అరకు జనసేన POC శెట్టి చిరంజీవి గారు, బిజెపి తరఫున అల్లూరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి మఠం శాంత కుమారి గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేయబోతుందన్న సీట్ల సర్దుబాటుపై చర్చించారు.




