Araku: అరకులో వైకాపా విస్తృత స్థాయి సమావేశం - రేగం చాణక్య ఫైర్!

Araku: అరకులో వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. హైడ్రో ప్రాజెక్ట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలకు కూటమ కుట్ర చేస్తోందని యువజన విభాగం నేత చాణక్య మండిపడ్డారు.

REHAMAN, ARAKU
Published on: 7 Oct 2026 10:16 AM IST
Araku
X

Araku: అరకులో వైకాపా విస్తృత స్థాయి సమావేశం - రేగం చాణక్య ఫైర్!

Araku: అరకు వ్యాలీ మండలం,సుంకరమెట్ట పంచాయతీ, జడ్డిపనస సామాజిక భవనంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాలతో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేగం చాణక్య గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హైడ్రో ప్రాజెక్టు పేరుతో గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి బాక్సైట్ తవ్వకాలకు కుట్ర చేస్తోందని, జగనన్న జీవో 97 రద్దు చేసి దాన్ని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

హామీలు నెరవేర్చకుండా మన పథకాలకు పేర్లు మార్చిందని, గతంలో ఇంటికే రేషన్, ఇంటికే వైద్యం వచ్చేదని,ఇప్పుడు ప్రజలు క్యూలైన్లలో, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మవద్దని,రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

జగనన్న భరోసాతో ఐడీ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల బీమా, మరణిస్తే కుటుంబానికి అదనంగా రూ.5.50 లక్షలు ఈ నెల 1 నుండి అమలని,ఓటిపి చెప్పక కార్డు రాని వారు నాయకులను కలవాలని, కార్డుల కోసం కృషి చేసిన బూత్ ఇన్చార్జ్ కొర్ర అర్జున్ రావును అభినందించారు.

గతంలో బీ-ఫామ్ ఇచ్చినా పార్టీలోనే కొందరు డబ్బులిచ్చి ఇండిపెండెంట్ ను నిలబెట్టి ఓడించారని,ఇకపై నిజాయితీపరులకే బీ-ఫామ్ ఇస్తామని,పంచాయతీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం నాయకులు,కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరకు వ్యాలీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి గారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్ గారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు స్వాభి రామచంద్ర గారు,సమర్ధి శత్రుగును గారు,నోబో గారు. మాజీ సర్పంచ్ భాస్కర్ రావు గారు,గొల్లూరి మొస్య గారు, వైసీపీ అరకు వ్యాలీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్ గారు. వైసీపీ అరకు వ్యాలీ మండలం బూత్ కమిటీ ఇన్చార్జ్ కొర్ర అర్జున్ రావు గారు. డివిజనల్ యూత్ వింగ్ కార్యదర్శి మండ్యకేడ్డి బాలరాజు గారు.

వైసీపీ అరకు వ్యాలీ మండల పార్టీ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, మాజీ సూపర్ ఎంపీపీ జన్ని నరసింహమూర్తి గారు. వైసీపీ మండల నాయకులు బుజ్జి బాబు గారు,బేసు,సమరెడ్డి నవీన్ కుమార్ గారు గ్రామ పంచాయతీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU