Arilova: ఆరిలోవ భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ వేడుకలు

Arilova: ఆరిలోవలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆరిలోవ సీఐ శ్రీనివాస్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

SHIVA, BHIMILI
Published on: 26 Aug 2026 4:28 PM IST
Arilova
X

Arilova: ఆరిలోవ భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ వేడుకలు

ఆరిలోవ: అరిలోవలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆకుపచ్చ,జాతీయ పతాకాలతో దరూద్ పఠిస్తూ భారీ బైక్,కార్ల ఊరేగింపు చేపట్టారు.

ఈ ర్యాలీలో యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వేడుకలకు హాజరైన అరిలోవ సీఐ శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ర్యాలీలోని చిన్నారులను ఎత్తుకుని ముచ్చటించిన సీఐ,వారితో సరదాగా గడుపుతూ ఆప్యాయతను చాటుకోవడం స్థానికులను ఆకట్టుకుంది.పోలీసులు ముందుజాగ్రత్త చర్యలతో భద్రతా ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story