Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Anakapalli: అనకాపల్లిలో మోదీ జన్మదినం సందర్భంగా టీడీపీ నేత సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో 'ఆశీర్వాద దీపం' నిర్వహించారు.
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Anakapalli: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్‌లోని భీముని గుమ్మం సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు ఆశీర్వాద దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




