Paderu: సమయపాలన క్రమశిక్షణ తప్పనిసరి సిబ్బందికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
Paderu: కార్యాలయ సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశాలు.
Paderu: సమయపాలన క్రమశిక్షణ తప్పనిసరి సిబ్బందికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ సిబ్బంది సమావేశం నిర్వహించారు. కార్యాలయ పనితీరు, విధుల పురోగతి, క్రమశిక్షణ, సమయపాలనపై సమావేశంలో సమీక్షించారు.
నిర్దేశించిన కార్యాలయ సమయాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, రోజుకు కేటాయించిన పనులను అదే రోజు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పూర్తిచేసిన పనుల వివరాలను అధికారిక గ్రూపులో క్రమం తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా, సంబంధిత అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది అందరూ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా, సమయపాలనతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.




