Araku: డుంబ్రిగూడలో టీడీపీ రెబల్ అభ్యర్థితో కీలక చర్చలు జరిపిన నేతలు!

Araku: అరకు డుంబ్రిగూడలో టీడీపీ రెబల్ అభ్యర్థితో చర్చలు జరిపిన కిడారి శ్రావణ్ కుమార్, బుద్ధ నాగజగదీష్. కూటమి అభ్యర్థికి సహకరించాలని విజ్ఞప్తి.

REHAMAN, ARAKU
Published on: 3 Nov 2026 9:50 AM IST
Araku
X

Araku: డుంబ్రిగూడలో టీడీపీ రెబల్ అభ్యర్థితో కీలక చర్చలు జరిపిన నేతలు!

Araku: డుంబ్రిగూడ మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ రెబల్ అభ్యర్థితో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ. కిడారి శ్రావణ్ కుమార్ గారు, అరకు అసెంబ్లీ పరిశీలకులు శ్రీ బుద్ధ నాగజగదీష్ గారు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ శ్రీ రాజశేఖర్ గారు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా పార్టీ సూచించిన కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలవాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల బరిలో తటస్థంగా ఉండాలని రెబల్ అభ్యర్థికి విజ్ఞప్తి చేశారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పార్టీ నిర్ణయానికి సహకరిస్తే భవిష్యత్తులో రాజకీయంగా తగిన గుర్తింపు, మంచి అవకాశాలు కల్పించేలా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఐక్యతను కాపాడుతూ, కూటమి విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU