Paderu: పాడేరు, అరకు, అనంతగిరి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన!

Paderu: అల్లూరి జిల్లా పాడేరు, అరకు, అనంతగిరి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ కే. సాహిత్. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌లపై అధికారులకు ఆదేశాలు.

REHAMAN, ARAKU
Published on: 3 Nov 2026 9:47 AM IST
Paderu
X

Paderu: పాడేరు, అరకు, అనంతగిరి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన!

Paderu: ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా పాడేరు సబ్ కలెక్టర్ అరకు వ్యాలీ, అనంతగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లు, బేలెట్ బాక్స్ ల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.

అనంతరం అనంతగిరి మండలంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పాల్గొని అధికారులకు, సిబ్బందికి కౌంటింగ్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్ బాక్స్ పొందుపరిచిన వివరాలు కరెక్టుగా ఉన్నది లేనిది చారి చూసి తదుపరి చర్యలు గైకొనాలని, కౌంటింగ్ సంబంధించిన పలు ముఖ్యమైన సూచనలు చేశారు.

అలాగే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘా, మూడంచెల భద్రతా వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ కేంద్రాలు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్), పోలింగ్ అనంతరం మెటీరియల్ స్వీకరణ (రిసెప్షన్) ప్రక్రియలు ఎటువంటి అయోమయం లేకుండా వేగంగా జరిగేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.

కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, శిక్షణలో బోధించే ప్రతీ అంశాన్ని సిబ్బంది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కించే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేపట్టాలని, కౌంటింగ్ హాల్‌లో అనుసరించాల్సిన నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి స్వామి నాయుడు, స్థానిక మండల్ తహశీల్దార్ వీరభద్ర చారి, ఎంపీడీఓ కె.ప్రభాకర్ రావు , జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి భీమ్ శంకర్రావు, మండల్ లెవెల్ శిక్షణ ఎన్నికల అధికారులు, గుజ్జుల కొండబాబు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU