Anakapalli: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నూతన విద్యార్థుల ఇండక్షన్ మీట్!
Anakapalli: అనకాపల్లి జిల్లా మకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల ఇండక్షన్ మీట్, ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
Anakapalli: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నూతన విద్యార్థుల ఇండక్షన్ మీట్!
Anakapalli: అనకాపల్లి జిల్లా మకవరపాలెంలోనిh అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నూతన విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని మరియు ర్యాగింగ్ నిరోధం పై అవగాహన (ఇండక్షన్ మీట్) బుధవారం, సెప్టెంబర్ 30, 2026 న కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు కాలేజ్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ప్రిన్సిపాల్ - ఆంధ్ర విశ్వవిద్యాలయం, ప్రత్యేక అతిథిగా శ్రీ షఫీ ఖాన్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్- పెన్నెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం, అవంతి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ డా. ఎమ్. ప్రియాంక , వైస్ ప్రెసిడెంట్ ఎమ్.వి.ఎస్ నందీష్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా. సి మోహన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిధులచే జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థినుల ప్రార్థనా గీతం తో ప్రారంభించారు.
అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత దేశానికి గొప్ప నిది, యువత తలచుకొంటే ఏదైనా సాదించవచ్చని, మీయొక్క జ్ఞానాన్ని దేశాభివృద్ధికి కొంత పంచాలని చెప్పారు. అలాగే విద్యార్థులు కృత్రిమ మేధస్సును ఎక్కువగా వాడుతున్నారు, అది మానవుని మేధస్సును నియంత్రించే స్థాయిలో ఉపయోగించ వద్దని అది అనార్థాలకు దారి తీస్తుందని చెప్పారు.
ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు కాలేజ్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ప్రిన్సిపాల్-AU మాట్లాడుతూ మనస్తత్వ శాస్త్రం ప్రకారం తెలివైన గొప్ప వ్యక్తులు సృష్టించ బడరని, ప్రతీ ఒక్కరు పుట్టుకతోనే పూర్తి తెలివితేటలతో జన్మిస్తారని వ్యక్తుల ప్రవర్తన, నడవడికను బట్టి గొప్పవ్యకులవుతారని డా. బి.ఆర్ అంబేత్కర్, అబ్దుల్ కలామ్, సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఉదహరించారు. ప్రతీ ఒక్కరు నిరంతరం నేర్చుకొనే తత్త్వం అలవర్చుకోవాలని, సమర్దవంతం గా నేర్చుకునేందుకు ఆక్టివ్ పార్టిసిపేషన్, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండం , తత్సంబందాలు పెంచుకోవడం ద్వారా సాధ్యమని చెప్పారు. మొబైల్ ఫోన్ వాడడం వ్యసనంగా మారిందని వీలైనంత దూరంగా ఉండాలని చెప్పారు.
శ్రీ షఫీ ఖాన్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్- పెన్నెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ విద్యార్థులు విషయ మరియు సాంకేతిక పరిజ్ఞానం లో ముందున్నప్పటికీ కమ్యూనికేషన్ లో బాగా వెనకబడుతున్నారు. కమ్యూనికేషన్ పై దృస్టి సారించాలన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను పరిమితికి మేర ఉపయోగించాలని లేకపోతె మన మేధశ్శక్తి తగ్గుతుందని చెప్పారు.
అవంతి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ డా. ఎమ్. ప్రియాంక మాట్లాడుతూ ఈ కళాశాల లో ఎన్నో కలలు ఆశలతో చేరుతారని, ఆ కలల ను సాకారం చేసుకొనే విధంగా నాణ్యమైన విద్య అందించే అధ్యాపకులు, సౌకర్యాలు ఉన్నాయని అభిలషణీయంగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
అవంతి విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ ఎమ్.వి.ఎస్ నదీష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ నాలుగు సంవత్సరాలు ప్రతీరోజు తరగతులకు హాజరై చదువు మీద దృష్టిపెట్టాలని, అలాగే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సి మోహన్ రావు మాట్లాడుతూ అవంతి ఇంజనీరింగ్ కళాశాల 26 సంవత్సరాలు క్రితం గ్రామీణ ప్రాంతం లో స్థాపించి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు- బి.టెక్, ఎమ్.టెక్ వంటి టెక్నికల్ కోర్సులు తో పాటు ఎమ్.బి. ఎ., ఎమ్.సి. ఎ. వంటి ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశ పెట్టి, ఎన్.బి.ఎ, నాక్ వంటి విద్య ప్రామాణిక సంస్థల తో ఉత్తమ రేటింగ్ సాధించి 2023 లో కళాశాలకు 10 సంవత్సరాల పాటు స్వయంప్రతిపత్తి హోదా, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు మరియు ఆధునిక విద్యా సౌకర్యాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన NCC యూనిట్, NSS ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాశాల యొక్క అభివృద్ధిని వివరించారు, అలాగే ముఖ్య అతిధులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి విద్యార్థులకు మంచి విషయాలను సూచించినదుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వాలీ బాల్ మరియు ఖో ఖో, విద్యార్థినులకు త్రో బాల్ మరియు ఖో ఖో ఆటలపోటీల విజేతలకు, ఎన్.సి.సి యూనిట్ లో కాడెడ్స్ కు ధ్రువ పత్రాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిధుల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు ఆధ్యాత్మిక, సామజిక, దేశభక్తి మరియు వినోదం ఇతివృత్తాలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రుతలూగించాయి. ఈ సమావేశం లో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది 1650 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




