Paderu: అల్లూరి జిల్లాలో అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు!
Paderu: అల్లూరి జిల్లాలో అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ టి. నిషాంతి మార్గదర్శకత్వంలో గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు.
Paderu: అల్లూరి జిల్లాలో అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు!
Paderu: అల్లూరి జిల్లాలో గిరిజనులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స్థిరమైన ఆదాయ, ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న వెదురు ఆధారిత జీవనోపాధి కార్యక్రమంపై బుధవారం SERP CEO ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు గౌరవనీయులైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF), SERP ఎక్స్-ఆఫీషియో ప్రభుత్వ కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు (DFOs), సంబంధిత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ప్రాజెక్టు డైరెక్టర్లు (PD-DRDA) పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభించడం, వెదురు వనరులను స్థిరమైన పద్ధతుల్లో వినియోగించడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు మార్కెట్ అనుసంధానంపై సమీక్షించారు.
అల్లూరి జిల్లాకు 5,000 మంది రైతుల లక్ష్యం
DAY-NRLM Bamboo Subsector Programme కింద 2026–27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 35,000 మంది రైతుల లక్ష్యం నిర్దేశించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 11 మండలాల్లో 5,000 మంది రైతులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ కార్యక్రమం ద్వారా సన్నకారు, చిన్నకారు రైతులు, అంచు భూముల రైతులు మరియు ఆర్థికంగా వెనుకబడిన గిరిజన కుటుంబాలకు వెదురు సాగు ద్వారా స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించడంతో పాటు సాగు–కోత–ప్రాసెసింగ్–విలువ జోడింపు–మార్కెటింగ్ వరకు సమగ్ర జీవనోపాధి అవకాశాలను అభివృద్ధి చేయనున్నారు. కార్యక్రమంలో Bambusa tulda, Dendrocalamus longispathus వంటి వెదురు రకాలను ప్రోత్సహిస్తున్నారు.
3,504 మంది రైతుల నమోదు – 1,54,100 మొక్కల పంపిణీ
సెప్టెంబర్ 30, 2026 నాటికి అల్లూరి జిల్లాలో 3,504 మంది రైతులు కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. మొత్తం 2,10,240 మొక్కలు అవసరం కాగా, ఇప్పటివరకు 1,54,100 మొక్కలు పంపిణీ చేశారు.
అలాగే 1,454 మంది రైతులు వెదురు మొక్కలను నాటడం పూర్తి చేశారు. మిగిలిన మొక్కల పంపిణీ, దెబ్బతిన్న మొక్కల స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కల సమకూర్పు, కొరతను అధిగమించడం మరియు నమోదు చేసుకున్న రైతులతో వేగంగా నాట్లు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు
వీడియో కాన్ఫరెన్స్‌లో అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ, SERP, DRDA మరియు సంబంధిత జిల్లా యంత్రాంగం సమన్వయంతో వెదురు కోతలు, సేకరణ, రవాణా మరియు తదుపరి ప్రక్రియలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
వెదురు వనరులను స్థిరమైన పద్ధతుల్లో వినియోగిస్తూ గిరిజన కుటుంబాలకు గరిష్ట ఆర్థిక ప్రయోజనం కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
వెదురుతో అనేక విలువ ఆధారిత ఉత్పత్తులు
వెదురును కేవలం ముడి పదార్థంగా విక్రయించకుండా Primary Processing Units ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వెదురు నుంచి Split Bamboo ద్వారా బోర్డులు, లంబర్, ఫ్లోరింగ్, ఫర్నిచర్; Bamboo Strips ద్వారా క్యాబినెట్స్, మాడ్యులర్ ఫర్నిచర్, ఇంటీరియర్ ఉత్పత్తులు; Bamboo Sticks ద్వారా అగరబత్తి కడ్డీలు, టూత్‌పిక్స్, స్క్యూయర్స్, చాప్‌స్టిక్స్ తదితర ఉత్పత్తులు; Bamboo Pellets ద్వారా పారిశ్రామిక బాయిలర్లు, ఫర్నేస్‌లు, వంట మరియు ఇతర అవసరాలకు బయోమాస్ ఇంధనం తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.
దీంతో వెదురు సేకరణ, గ్రేడింగ్, కటింగ్, స్ప్లిటింగ్, స్ట్రిప్ మరియు స్టిక్ తయారీ, ఎండబెట్టడం, ట్రీట్‌మెంట్, పెల్లెట్ తయారీ, ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్ వంటి అనేక దశల్లో స్థానిక ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, మార్గదర్శకత్వంలో ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, మార్గదర్శకత్వంలో జిల్లాలో వెదురు ఆధారిత జీవనోపాధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వెదురు సాగు ద్వారా గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు, స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేసి వెదురు ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెట్ అవకాశాలు మరియు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
అటవీ శాఖ సమన్వయం
DFO పాడేరు శ్రీమతి ఉమామహేశ్వరి మరియు DFO చింతపల్లి శ్రీ వై.ఎల్. నరసింహరావు సంబంధిత ప్రాంతాల్లో వెదురు సాగు, నిర్వహణ మరియు కోతలకు సంబంధించిన అటవీ శాఖ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.
వెదురు సాగు నుంచి కోత, ప్రాథమిక ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వరకు సమగ్ర Bamboo Value Chainను అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు వెదురు వనరులను స్థిరంగా వినియోగించడం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది.




