Visakhapatnam: పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి.. గాజువాకలో ఘనంగా జయంతి వేడుకలు
Visakhapatnam: గాజువాకలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.
Visakhapatnam: పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి.. గాజువాకలో ఘనంగా జయంతి వేడుకలు
Visakhapatnam: దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన మహా ముని శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర సవర కుల సంఘం కార్పొరేషన్ డెవలప్మెంట్ మెంబర్ గుర్రం నూకరాజు అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక దుర్గానగర్ లో వున్న ఆయన విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బిజేపి రాష్ట్ర మీడియా పేనలుస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు మాజీ కార్పొరేటర్ రాజాన రామారావు జనసేన వార్డు అధ్యక్షులు కరణం కనకారావు తదితర కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎంత కష్టమైన పని అయినా, పట్టుదలతో దీక్ష చేసి దివిలో ఉన్న గంగమ్మను భువికి తీసుకు వచ్చిన గొప్ప మహా ముని శ్రీశ్రీ భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయన వారసులుగా ఉన్న సగరులు ఎంతో అదృష్టవంతులు అని అన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షులు దేవుడు,టిడిపి గాజువాక అసెంబ్లీ ఇన్చార్జి ప్రసాదుల శ్రీనివాసరావు,నాయకులు తాతారావు, అప్పారావు,ఆకుల అప్పలసూరి , బొండా యల్లాజీరావు,చేబ్రోలు అశోక్ ,దశేంద్ర , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




