Visakhapatnam: చిట్టివలస రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభం

Visakhapatnam: భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు చిట్టివలస రైతు బజార్‌లో ఆధార్‌పై కిలో రూ.35 చొప్పున సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించారు.

SHIVA, BHIMILI
Published on: 3 Oct 2026 1:08 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: చిట్టివలస రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభం

Visakhapatnam: భీమునిపట్నం శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, ఉల్లి విక్రయాలను చిట్టి వలస రైతు బజారు లో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ కురిమిన రామ స్వామి నాయుడు గారు

శని వారం (3-10-2026 ) నాడు ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి నెలకు ఆధార్ కార్డు ఆధారంగా 2 కిలోల ఉల్లి కిలో రూ 35 లకు ఇవ్వనున్నట్లు రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ ఎం సత్య కళ గారు తెలిపారు

ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ కురిమిన రామ స్వామి నాయుడు గారు వినియోగదారులను కోరారు ఈ కార్యక్రమం లో కమిటీ వైస్ చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ పి జగన్నాథం, డైరెక్టర్ గారైన చే ట్ల ఉమాదేవి గారు, జన సేన నాయకులు శ్రీ నీలాపు శంకర రెడ్డి గారు, కూటమి నాయకులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI