Bheemili: జాతీయ నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన భీమిలి కేథరిన్ విద్యార్థులు!

Bheemili: భీమిలిలోని కేథరిన్ స్కూల్ విద్యార్థులు తన్వి, జీరు పార్థసాత్విక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి అండర్-17 నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.

SHIVA, BHIMILI
Published on: 17 Nov 2026 3:03 PM IST
Bheemili
X

Bheemili: జాతీయ నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన భీమిలి కేథరిన్ విద్యార్థులు!

భీమిలి: స్థానిక భీమిలిలో గల కేథరిన్ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. ఇటీవల ఈ నెల 13 నుండి 15 తేదీలలో 70వ SGF అంతర జిల్లా అండర్ 17 నెట్బాల్ క్రీడలను అన్నమయ్య జిల్లా చిన్న తిప్ప సముద్రం, జిల్లా పరిషత్ హైస్కూల్ లో నిర్వహించారు. ఈ పోటీలలో విశాఖ జిల్లా బాలురు ద్వితీయ స్థానం కైవసం చేసుకోగా బాలికలు జట్టు మొదటి స్థానం గెలుపొందారు.

విశాఖ జిల్లా జట్టులో కేథరిన్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు పాల్గొనగా అందులో ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యి ఇటు మన బీమ్లికి అటు కేథరిన్ విద్యాసంస్థకి పేరు ప్రఖ్యాతులు సాధించారు.

కేథరిన్ స్కూల్ కి చెందిన విద్యార్థులు

సూరడ సుప్రియ, లిఖిత, తన్వి, జీరు పార్థసాత్విక్, జి.జీవన్, మాధవ్ పాల్గొన్నారు. ఈ పోటీలో సుప్రియ, లిఖిత, తన్వి అద్భుతంగా ఆడి జట్టుకు బంగారు పతకాన్ని సాధించుటలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పార్థ సాత్విక్, జి. జీవన్, మాధవ్ రజత పతకాన్ని సాధించుటలో తమ ప్రతిభను కనబరిచారు. ఈ క్రీడలో అత్యద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించిన కేథరిన్ విద్యార్థులు తన్వి, పార్థ సాత్విక్ లు ఆంధ్ర రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపిక అయ్యి కేథరిన్ స్కూల్ పేరును దేశ సరిహద్దులకు పరిచయం చేసారు.

ఈ ఇద్దరు క్రీడాకారులు మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో డిసెంబర్ 6 నుండి 10 వరకు జరగబోయే జాతీయ స్థాయి నెట్బాల్ క్రీడలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఆలివర్ రాయి గారు మాట్లాడుతూ ఈ విధంగా జాతీయస్థాయి పోటీలకు వివిధ క్రీడలలో కేథరిన్ స్కూల్ నుండి ఇప్పటికే ఎందరో ఎంపికవడంపట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

కేథరిన్ క్రీడాకారులు ఇప్పటికే ఎన్నో క్రీడలలో నేషనల్స్ ఆడి, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు సాధించారు. ఈ పరిసర ప్రాంతాలలో ఆటలలో కేథరిన్ ఇచ్చే ప్రాధాన్యత, స్ఫూర్తి, ప్రోత్సాహం, కోచింగ్ మరే స్కూలు ఇవ్వడం లేదని, అందువల్లనే స్పోర్ట్స్ ర్యాంకింగ్ గత సంవత్సరం కూడా విశాఖ జిల్లాలో రెండవ స్థానం, మండలంలో మొదటి స్థానం చేజెక్కించుకున్నామని, ప్రతి క్రీడలలోనూ అత్యద్భుత నైపుణ్యాలను సాధించడానికి కారకులైన కేథరిన్ వ్యాయామ అధ్యాపక హెచ్. ఓ. డి అనిల్ కుమార్ ను ఇతర వ్యాయామ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI