Bheemili: భీమిలి నియోజకవర్గానికి ₹2.74 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం!
Bheemili: భీమిలి నియోజకవర్గంలో ఏడుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ₹2.74 లక్షల సహాయం మంజూరు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు TNSF నాయకుల ధన్యవాదాలు.
Bheemili: భీమిలి నియోజకవర్గానికి ₹2.74 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం!
Bheemili: భీమిలి నియోజకవర్గానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మొత్తం రూ. 2,74,077 ఆర్థిక సహాయం మంజూరైంది. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భీమిలి నియోజకవర్గ TNSF అధ్యక్షుడు కంటుబోతు సుమంత్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయని, అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందే ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
CMRF ద్వారా ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలు:
1. జంగాల నరసింహమూర్తి – ₹30,000
2. మొకర సూరిబాబు – ₹37,195
3. సబ్బవరపు దేవుడుబాబు – ₹22,795
4. బుడమూరి అప్పారావు – ₹66,259
5. అవనాపు జీయాన్ష్ – ₹40,917
6. కాట సూర్యనారాయణ – ₹36,076
7. నల్లి అప్పలకొండ – ₹40,835
మొత్తం: ₹2,74,077
ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ గారికి, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంబంధిత ప్రజాప్రతినిధులకు కంటుబోతు సుమంత్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.




